మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు నడపడంతో పాటు ఒక పెద్ద తరహా వ్యక్తిగా అందరూ గౌరవిస్తారు. చిరంజీవి కూడా ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళడు… వెళ్లడం కూడా ఇష్టముండదు. అందుకే చిరంజీవి టాలీవుడ్ లో అందరివాడిగా పేరు సంపాదిస్తే అతడి తమ్ములిద్దరు కొందరివారిగానే మిగిలిపోయారు.

నిన్న నాగబాబు ట్విట్టర్ లో గాడ్సే జయంతిని స్మరించుకుంటూ అతడు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద వివాదాన్ని సృష్టించాయి. గాంధీజీ కన్నా గాడ్సేనే గొప్ప అన్నట్లు నాగబాబు వ్యవహరించిన తీరుతో అతడిపై అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. దీనితో సోషల్ మీడియాలో మెగా కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు ఇక మెగాకుటుంబ అభిమానులంతా గాడ్సే అభిమానులుగా మారాలేమో అంటూ విమర్శించడంతో చిరంజీవి హార్ట్ అయ్యాడని తెలుస్తుంది.

ఇలా లేనిపోని వివాదాలతో పిచ్చివాగుడు వాగే నాగబాబుని ఇన్ని రోజులు భరిస్తూ వస్తున్న చిరంజీవి మరొకసారి ఇలా చేసి తమ పరువు తీయవద్దని, ముందు అర్జెంటుగా క్షమాపణలు చెప్పమని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో చేసేది లేక నాగబాబు ట్విట్టర్ సాక్షిగా క్షమాపణలు చెప్పాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

అసలు నాగబాబు మనస్తత్వానికి ఒకరిపై రాళ్ళేయడమే తప్ప, వాటిని వెనక్కు తీసుకునే బాపతు కాదు, అతడు మొదటి నుంచి మొండివాడిగా ఇష్టానుసారం ఏది పడితే అది మట్లాడుతూ నెటిజన్స్ చేత తిట్లు తినడంలో ముందు వరుసలో ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చెప్పేదేముందు అతడికి నచ్చితే బయటకు వస్తాడు.. లేకపోతే ఫార్మ్ హౌస్ కే పరిమితమవుతారు. ఈ విషయంలో నాగబాబుని పవన్ కళ్యాణ్ కనీసం ప్రశ్నించలేదని, జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాగబాబు అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ట్విట్టర్ సాక్షిగా కండించకుండా మిన్నకుండటం చూస్తుంటే
మహాత్మగాంధీపై ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది.

ఎవడు మనోడు, ఎవడు పగోడు అనేది ఎన్టీఆర్ కు బాగా తెలిసొచ్చింది