నిన్న బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ తో చనిపోవడంతో దాదాపుగా యావత్ దేశంలో ఉన్న ప్రముఖ తారలంతా స్పందిస్తూ బాలసుబ్రమణ్యంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. అందులో భాగంగా మన తెలుగు అగ్రహీరోలు కూడా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బాలు అంటే ఎనలేని ప్రేమ, తాను బాలసుబ్రమణ్యం ఇచ్చిన సలహాలు వలనే ఇంత ఎదిగానని చిరంజీవి ఒక వీడియో విడుదల చేసి చెప్పుకొచ్చారు.

తమకు సినిమాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఎంతో అనుబంధముందని, మద్రాస్ లో నివాసముండే సమయంలో బాలు గారు తాను పక్క పక్క వీధులలో ఉండేవారమని, అప్పుడప్పుడు తమ కుటుంబాలు కలుసుకుంటుండేవాని, తాను అన్నయ్యా అని పిలిస్తే ప్రేమగా బాలు గారు తమ్ముడు అని సంబోధించేవారని తాను మొదట్లో బాలు గారిని “నువ్వు” అనేవాడిని ఆ తరువాత అతను గొప్పదనం తెలుసుకొని మీరు అనడం మొదలుపెడితే నువ్వు అలా మాటలో తేడా చూపిస్తే తనకు ఎందుకో దూరం పెరుగుతున్నట్లు ఉందని నన్ను “నువ్వు” అనే సంబోధించు అని బాలు గారి చెప్పినట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక చిరంజీవి హీరోగా బాగా ఎదిగిన తరువాత కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా చూస్తున్న సమయంలో బాలసుబ్రమణ్యం చిరంజీవిని చివాట్లు పెట్టారట. “నువ్వు ఒక గొప్ప నటుడివని, కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని నీ కెరీర్ నాశనం చేసుకోవద్దని, నీలో ఎంతో నటన దాగి ఉందని కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కళామ్మతల్లికి నాశనం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారట. కానీ తాను మాత్రం అప్పుడు బాలు గారికి అభిమానులు ఏది కోరుకుంటే అందుకు తగట్లకు మనం ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పానని చెప్పుకొచ్చారు. బాలు గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే “స్వయంకృషి, రుద్రవీణ, ఆరాధన, ఆపద్బాంధవుడు” వంటి సినిమాలు చేసానని చెప్పుకొచ్చారు. కళను బాలు గారు ఎంతో ప్రేమించే వారని ఈరోజు మన మధ్య నుంచి దూరంగా వెళ్లిపోవడంతో తన సొంత అన్నయ్యను కోల్పోయిన బాధ నన్ను కలచి వేస్తుందని చిరంజీవి వీడియో రూపంలో విడుదల చేశారు.

మీరు పాడకపోయినా నా చిత్రాలు హిట్ అవుతాయని బాలుపై హీరో కృష్ణ ఆగ్రహానికి కారణం ఎవరో తెలుసా?