ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త సినీ ప్రముఖులు దిగ్బంతి వ్యక్తం చేశారు. ఇక జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం తనను ఎంతగానో కలచి వేసిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయనతో చివరిసారిగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించానని.. ఆయనొక అద్భుతమైన నటుడని చిరంజీవి తెలిపారు.

స్టేజీపై తన నాటకం చూడడానికి ఒకసారి జయప్రకాశ్ రెడ్డి అడిగారని చిరంజీవి గుర్తు చేశారు. నాటకరంగం నన్ను కన్నతల్లి, సినిమా రంగం నన్ను పెంచిన తల్లి అందుకే శని, ఆదివారాల్లో ఇప్పటికే షూటింగులు పెట్టుకొనండి.. స్టేజి మీదే ప్రదర్శనలు ఇస్తుంటా మీరు ఎప్పుడైనా రావాలి అని జయప్రకాశ్ రెడ్డి తనను అడిగారని.. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయానని చిరు అన్నారు. సినిమాలలో ఆయనొక ప్రత్యేకమైన విలక్షణ నటుడిగా ఒక ట్రెండ్ సృష్టించుకున్నారని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నని చిరు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువుగా సెర్చ్ చేసింది వేటినో తెలుసా..!

అద్భుతమైన ఫీచర్లతో పోకో ఎం2 వచ్చేసింది..!

గంగవ్వకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికం..!