ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలకు చిరు హాజరవటం లేదట. ఈ వేడుకలను శిల్పకళా వేదికలో మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ పుట్టిన రోజు వేడుకలకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతుందట.

ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అరవింద్, వరుణ్ తేజ్ ఇలా అందరూ హాజరవబోతున్నారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ కలవలేదు. కాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కలవనుండడంతో అభిమానులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •