కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గుండు చేయించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని చిరు గుండుతో మీసాలు లేకుండా కనిపించారు. దీనిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరు పెట్టారు. చిరుని ఆ లుక్ లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే చిరు నిజంగా గుండు చేయించుకున్నారా లేక మహిమ ఏదైనా ఉందా అని కొందరు సందేహించారు.

అయితే చిరు గుండుకు సంబంధించిన అసలు విషయం బయటపడింది. తను ‘అర్బన్ మాంక్’ లుక్ మేకింగ్ వీడియోను చిరు ఇంస్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే చిరు నిజంగా గుండు చేయించుకోలేదని ముగ్గురు మేకప్ ఆర్టిస్టులు కష్టపడి చిరుకు ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తుంది. ఇక మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.