వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రీస్ గేల్ తన క్రికెట్ ప్రయాణానికి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్ ఇండియాతో జరిగే హోమ్ టెస్ట్ తో క్రికెట్ కు పూర్తి స్థాయి రిటైర్మెంట్ ప్రకటించిన గేల్, గతంలోనే ఐసీసీ వరల్డ్ కప్ తరువాత తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టెస్ట్ ఫార్మేట్ కూడా ఇండియా టూర్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించి అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మెట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలియచేసాడు. 

1999 లో టీమ్ ఇండియాతో జరిగిన వన్ డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరగేంట్రం చేసిన గేల్ ఇప్పటి వరకు 103 టెస్టులతో పాటు 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టులలో 7214 వన్డేలు, 10345 టెస్టులు, టీ-20 లో 1627 పరుగులు చేసాడు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •