దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 5.0 జూన్ 30 వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా దాదాపుగా మాల్స్, థియేటర్లు మినహా అన్నింటికీ సడలింపులనివ్వడం జరిగింది. ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను షూటింగ్స్ తో పాటు సినిమాల విడుదలకు అనుమతినివ్వాలని కోరుతున్నారు. అతి త్వరలో షూటింగ్స్ కు అనుమతితో పాటు సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అవ్వనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫేమస్ థియేటర్ సుదర్శన్ 35MM అందుకు తగట్లు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

భౌతిక దూరం పాటించేలా ఒక సీటు విడిచి మరొక సీటులో ప్రేక్షకులు కూర్చుని సినిమా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్న వేళ అందుకు తగట్లు థియేటర్ లో సీటింగ్ లో మార్పులు చేస్తూ ప్రతి సీటు మధ్యలో గ్యాప్ ఉండేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలా సీట్ల మద్యం గ్యాప్ ఉండేలా పనులు మొదలు పెట్టింది ఒక్క సుదర్శన్ 35MM థియేటర్లోనే అని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజులలో అన్ని థియేటర్లలో సీట్ల మార్పిడి చేసే కార్యక్రమాలను అందరూ చేపడతారేమో చూడాలి.

రోజు రోజుకి కరోనా వైరస్ ఉదృతమవ్వడమే తప్ప, తగ్గకపోవడంతో ఇక చేసేది లేక ఆర్ధిక కార్యకలాపాలను అందరూ భౌతిక దూరం పాటిస్తూ మొదలుపెట్టడంతో పాటు ఇలా భౌతిక దూరం దాదాపుగా ఏడాది నుంచి రెండేళ్ల పాటు పాటించవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న వేళ అందుకు తగట్లు ఏర్పాట్లు షురూ చేస్తున్నారు.

జర కాస్త ఆగండి సామి, ఈరోజు పొగిడిన నోటితో రేపు తిట్టవలసి వస్తుంది

“సర్కారు వారి పాట” పది లక్షల షేర్స్ తో మోత మోగిపోయింది

ఏపీ ఎన్నికలాధికారి సీటులో కూర్చునే వరకు నిమ్మగడ్డ నిద్రపోయేలా లేడుగా