2005 లో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘చంద్రముఖి’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నయనతార. ఆ సినిమా మంచి హిట్ కావడంతో ఇక అందరి స్టార్ల చూపు ఆమెపై పడింది. ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తమిళ, మలయాళం, తెలుగు వంటి భాషలలో తన సత్తా చాటింది నయనతార.

అప్పటి’ చంద్రముఖి’ నుండి ఇప్పటి ‘సైరా’ సినిమా వరకు విరామం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక నయనతార సినిమాలలోకి రాకముందు ఓ మలయాళ టీవీ ఛానెల్ కి యాంకర్ గా చేసిందట. ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అప్పటి ఫోటోలను చూస్తుంటే ఆమె అసలు నయనతారనేనా అని అభిమానులు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటి ఫొటోలో ఉన్న నయనతార చాలా సన్నగా, చిన్న అమ్మాయిలాగా కనపడుతుంది. అప్పటి నయనతారను చూసిన కొంత మంది అభిమానులైతే టీవీ యాంకర్ గా మొదలైన నయన జీవితం అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిందని సంతోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడు స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలోనూ నటించి తన సత్తా చాటుతుంది నయనతార. ఇప్పుడు సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి నయనతార 6 కోట్ల పారితోషికంగా తీసుంటుందని సమాచారం. సౌత్ లో హీరోయిన్లలో ఇదే అత్యధిక పారితోషికం కావడం గమరణార్ధం.

  •  
  •  
  •  
  •  
  •  
  •