హీరో రామ్ చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి హీరోగా చేస్తున్న “సైరా నరసింహ రెడ్డి” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చకచక పోస్ట్ ప్రొడక్షన్స్ పనులలో బిజీబిజీగా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయలతో రామ్ చరణ్ తన తండ్రితో డ్రీం ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి హైప్ ఉంది గాని ముంబైలో ఈ సినిమాపై అంత ఆసక్తి కనపరచడం లేదు.

ఇక సినిమాకు సంబంధించి చిరంజీవి ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ కూడా తన కోడలు ఉపాసనకు ఇచ్చాడు. ఈ సినిమాకు బజ్ తీసుకొచ్చే పనిని చిరంజీవే నేరుగా రంగంలోకి దిగి… సినిమా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఉండటంతో ఈ సినిమా మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ముంబైలో ఏర్పాటు చేయాలని బావిస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కేర్ తీసుకోవడమే కాకుండా సినిమాను బాలీవుడ్ లో భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే విధంగా తమిళంలో కూడా విడుదలవబోతున్న “సైరా” చిత్రానికి సంబంధించి అక్కడ కూడా ఒక ఈవెంట్ చేసి సినిమాకు హైప్ కోసం ట్రై చేస్తున్నారు. ఇంకా మరో నెలనర్ర సమయం ఉండటమే కాకుండా “సాహు” సినిమా విడుదలై దానిని హడావిడి ముగిసిన తరువాత మరింత ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. 

  •  
  •  
  •  
  •  
  •  
  •