వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న “వాల్మీకి” సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నిర్మాతలకు, దర్శకుడికి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో ముగించాలని నిర్మాతలు ముందుగానే దర్శకుడుకి చెప్పారట. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ ఎప్పుడో దాటి పోయినట్లు తెలుస్తుంది. ఇక సినిమా విడుదలకు ముందే హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేయాలని, వైజాగ్, కృష్ణ సినిమా హక్కులు కూడా కావాలని పట్టుబడుతున్నాడట. ఇలా హరీష్ శంకర్ సినిమా చివరకు వచ్చిన తరువాత ఇలా ప్రవర్తించడం పట్ల నిర్మాతలు నొచ్చుకున్నారని తెలుస్తుంది. 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఏదైనా చాల పద్ధతిగా డీల్ చేస్తారని, గొడవలు లాంటి జోలికి వెళ్లకుండా సామరస్య వాతావరణంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటారు.

కానీ హరీష్ శంకర్ వ్యవహారం ఎటు తేలకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నారని ఫిల్మ్ వర్గాల నుంచి గుస గుసలు వినపడుతున్నాయి. ఇక “వాల్మీకి” సినిమాలో పూజ హేగ్దే ఒక చిన్న రోల్ చేస్తుంది. దానిని కూడా దాదాపుగా 20 రోజుల పాటు షూట్ చేయడంతో రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక పూజ హేగ్డేకు సంబంధించి ఈమధ్యే ఒక పాటను ప్రైవేట్ స్టూడియోలో చిత్రీకరించడం జరిగింది.

మరోవైపున ఇంత గొడవ జరుగుతున్నాహీరో మాత్రం తన పని తాను చేసుకుంటూ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా దర్శక, నిర్మాతలతో సఖ్యత వ్యవహరిస్తున్నాడట. నిర్మాతలకు… దర్శకులకు మధ్య ఏర్పడిన గ్యాప్ వల్ల విడుదలకు సినిమా దగ్గర పడటంతో షూటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. నిర్మాతలకు సన్నిహితులైన కొంత మంది ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. “వాల్మీకి” సినిమా అన్ని సవ్యంగా జరిగితే సెప్టెంబర్ 13వ తారీకు విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •