ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా కేసులు తగ్గడం మంచి పరిణామమన్న జగన్.. జనవరి కల్లా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్ 12.0 నుండి 8.3 శాతానికి తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు పెరిగాయని.. కానీ కేసులు తగ్గుతున్నాయని జగన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా తగ్గుతుందనడానికి ఇదే నిదర్శనమని కరోనాతో సహజీవనం చేస్తూనే.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక జనవరి కల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 104 నెంబర్ కి ఫోన్ చేస్తే టెస్టులు, హాస్పటల్ వివరాలు అందాలని అన్నారు. ఈ నెంబర్ కు మాక్‌ కాల్స్‌ చేసి నెంబర్‌ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్‌ చేయండి. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతీ రోజూ మానిటర్‌ చేయండి. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయగానే అరగంటలోనే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి. కాబట్టి ఈ నంబర్‌ పక్కాగా పనిచేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

బిర్యానీ కోసం ఏకంగా గుడిలో హుండినే పగలగొట్టారు..!

మళ్ళీ తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి..!

భార్యను కొట్టడంతో కొలువు పోగొట్టుకున్నాడు.. వీడియో వైరల్..!