ఏపీ ప్రభుత్వం కర్నూల్ ను జ్యూడీషియల్ రాజధానిగా ఏర్పాటు చేయడానికి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఏపీ హైకోర్టు ప్రధాన కార్యాలయంను నిర్మించబోతున్నారు. దానితో పాటు దాని అనుబంధ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక అమరావతిలో, వైజాగ్ లో హైకోర్ట్ బెంచ్ లు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలనీ ఆయన ఈ లేఖలో కోరారు. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడే ఈ ఆలోచన చేశారని.. హైకోర్ట్ బెంచ్ కి రాజమండ్రి అనుకూలమని పేర్కొన్నారు. మరి ఉండవల్లి రాసిన లేఖకు సీఎం జగన్ ఏ విధముగా స్పందిస్తారో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •