ఏపీ ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీస్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించిన ఆయన.. సుమారు 50000 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. పాదయాత్రలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నానని, ఆప్కోస్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 50 శాతం ఎస్సి, ఎస్టీ, బీసీ లు ఉన్నారని ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని సీఎం తెలిపారు.

ఇక గత ప్రభుత్వంలో ఉద్యోగం రావడానికి లంచాలు, జీతాలు ఇవ్వడానికి లంచాలు తీసుకునే పరిస్థితి ఉందని జగన్ అన్నారు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థని మార్చాలని.. ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయింపులుంటాయని కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదని సీఎం తెలిపారు.

ఆకట్టుకుంటున్న వివో Y30 స్మార్ట్ ఫోన్..!

ఏపీ కరోనా తాజా బులెటిన్.. కొత్తగా 837 పాజిటివ్ కేసులు