దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకాన్ని సీఎం జగన్ బుధవారం ఆవిష్కరించారు. ఇక ఈ రోజు వైఎస్ఆర్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి జగన్.. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్న చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పుస్తకం అని తెలిపారు.

ఇక విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని.. ప్రతి ఒక్కరు ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నా.. నా బిడ్డల మాదిరిగా ఆయన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నా. ఇక సహృదయంతో ప్రతి ఒకరు ఈ పుస్తకాన్ని చదవాలని కోరుతున్నానని విజయమ్మ తెలియచేసారు.