ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విద్యాసంస్థలను మోనిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. www.apsermc.ap.gov.in పేరిట ఓ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన సీఎం.. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రాల్లోని అన్ని స్కూల్స్, కాలేజీల సమాచారం అంతా ఉంటుందని చెప్పారు. ఆయా విద్యాసంస్థలు స్వయంగా వాటి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో ఉంచుతారని చెప్పారు.

ఇక విద్యాసంస్థలు ఏవైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లయితే దీనిపై ఎవరైనా పిర్యాదు చేయవచ్చన్నారు. ఈ డొమైన్‌ అందరికి అందుబాటులో ఉంటుందని జగన్ చెప్పారు. విద్యారంగంలో కార్పోరేట్ వ్యవస్థకు చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్.. అందుకు సంబంధించి రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీళ్ళు రాష్ట్రంలో పలు విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రత్యేక కమిషన్లు తో ఇక కార్పొరేట్ విద్యాసంస్థల ఆటలు సాగవని చెప్పవచ్చు.

గొంతు మీద కాలు తొక్కి పెట్టి.. ఓ పోలీస్ అరాచకం..!

సొంతూర్లకు వెళ్ళడానికి పశువులు అమ్మి విమాన టికెట్స్ కొన్నారు.. అయినా కూడా..!