కే.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండవ ఎతైన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించాడు. వీరు గుంటూరులోని చిల్డ్రన్‌ స్పేస్‌ క్లబ్‌ అఫ్ ఇండియా సభ్యులు. ఈ నెల 17 న హైదరాబాద్ నుండి టాంజానియా బయలు దేరిన వారు 23 తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని.. క్లబ్ కార్యదర్శి జి.శాంతమూర్తి తెలిపారు. కాగా కిలిమంజారో పర్వతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నాడు శంకరయ్య. అనంతపురం జిల్లాలో ఆర్‌డీటీ స్వచ్చంద సంస్థలో స్పోర్ట్స్ కోచ్ గా పనిచేస్తున్న శంకరయ్య.. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి.

  •  
  •  
  •  
  •  
  •  
  •