ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న రచ్చబండ కార్యక్రమం మొదటిలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన వైఎస్సార్.. వాతావరం అనుకూలించకపోవడం వల్ల కర్నూల్ జిల్లా ఆత్మకూరు సమీపంలో నల్లమల అడవులలో హెలికాఫ్టర్ కుప్పకూలి మరణించారు. దీనితో రచ్చబండ ప్రోగ్రాం ఆగిపోయింది.

ఇప్పుడు మళ్ళీ రచ్చబండ కార్యక్రమం తెరమీదకు వచ్చింది. ఆయన తండ్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న కార్యక్రమాన్ని జగన్ నిర్వహించబోతున్నారు. దీని సంబందించిన షెడ్యూల్ ను అధికారులు రూపొందించే పనిలో ఉన్నారు. వైఎస్సార్ వర్ధంతి అయిన సెప్టెంబర్ 2 వ తేదీ నుండే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. గ్రామ వాలంటీర్ల విధివిధానాలు, ప్రభుత్వ పధకాల అమలు తీరు, గ్రామాల అభివృద్ధి మొదలైన సమస్యలపై సీఎం జగన్ పలు అభిప్రాయాలను సేకరించబోతున్నారు.

జగన్ సీఎం అయిన దగ్గర నుండి ఈ మూడు నెలలో కాలంలో సచివాలయానికే పరిమితమై అన్ని శాఖలలో సమీక్షా సమావేశాలతో తీరిక లేకుండా గడిపారు. ఇక ఏపీలో 13 జిల్లాలలో జగన్ సెప్టెంబర్ 2 నుండి విస్తృతంగా పర్యటించి.. అక్కడ ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలనుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •