విశాఖలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ నుండి గురువారం తెల్లవారుజామున రసాయనిక వాయువు లీకేజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఇక ఈ ఘటనపై తీవ్ర విచారం చేశారు సీఎం జగన్. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన విశాఖ చేరుకొని కింగ్ జార్జి ఆస్పత్రిలో బాధితులను నేరుగా పరామర్శించారు.

ఇక బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డాక్టర్లను కోరారు జగన్. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ గ్యాస్ దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జగన్ అన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని దైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం బాధితులకు భరోసా ఇచ్చారు.

గ్యాస్ లీక్ కావడానికి అదే ప్రధాన కారణం.. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వివరాలు..!

లీకైన గ్యాస్ పీలిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!