తెలంగాణ క్యాడర్ కు చెందిన స్టీఫెన్ రవీంద్రతో అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉండేది. స్టీఫెన్ రవీంద్ర నిజాయితీగల అధికారిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా పోలీసుల పట్ల మంచి భావన కలిగించేలా చేసాడు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఏపీకి డెప్యుటేషన్ మీద పంపాలని కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో చెప్పగా స్టీఫెన్ రవీంద్రను ఇచ్చేనందుకు సుముఖత చూపించారు.

కానీ కేంద్రం మాత్రం సరైన కారణాలు చెప్పలేదన్న కారణంతో అతడి డెప్యుటేషన్ ను తిరస్కరించింది. గత వారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరిని కలసి రావడం జరిగింది. వీరిద్దరితో చాలా విషయాలు ఏపీ గురించి చర్చకు వచ్చినా స్టీఫెన్ రవీంద్ర విషయమై మరొకసారి పునః పరిశీలించాలని కోరినట్లు వార్తలు వస్థలున్నాయి. మొదటి నుంచి సీఎం జగన్ తనకు కావలసిన అధికారులను వేరే రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ పై తీసుకొని వచ్చినా స్టీఫెన్ రవీంద్ర విషయంలో మాత్రం తన కల సాకారం కాలేదు. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొని వచ్చి ఇంటిలిజెన్స్ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు ఉంది. ఈసారైనా జగన్ కోరికను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. ఇక స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని కూడా ఏపీకి పంపించాలని కోరుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •