సీఎం జగన్ తాను చేసే విమర్శలు విమర్శనాత్మకంగా ఉంటాయి తప్ప అసభ్యకరంగా ఎక్కడ చేయరు. తనపై ఎవరైనా ఘాటుగా విమర్శించినా ఘాటుగానే బదులిస్తారు తప్ప నోరు జారరు. కానీ వైసీపీ పార్టీకి చెందిన చాల మంది ఎమ్మెల్యేలు అనవసరంగా నోరు జారీ ఈమధ్య చిక్కుళ్ళలో పడుతున్నారు. గతంలో ఆర్కే రోజా, చెవిరెడ్డి వీరిద్దరూ జగన్ పై ఎవరైనా ఘాటుగా విమర్శలు చేస్తే వారి అంతు చూసే వరకు నిద్ర పోయేవారు కాదు. కానీ జగన్ వారిద్దరిని కట్టడి చేయడంతో వారు ఈమధ్య ఘాటైన విమర్శలు తగ్గించారు.

ఇక గత వారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీకి పెద్ద డ్యామేజీ చేసినట్లు తెలుస్తుంది. అతడి “లంజాకొడకా”… “లంజ కంటే దారుణం, దొంగ నాకొడక” అంటూ చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పట్ల చేసిన వ్యాఖ్యలు వీడియో చూస్తున్నవారికే ఇబ్బందిగా అనిపించింది. సీఎం జగన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యల వలన పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని అన్నారట. కానీ తాను కావాలని అనలేదని అలా ఆవేశంలో వచ్చిందని చెప్పబోయిన సిఎం జగన్ వినలేదని తెలుస్తుంది.

అతడు వారిపై అసభ్యంగా తిట్టిన తరువాత కూడా జనసేన కార్యకర్తలు అతడి ఇంటి దగ్గరకు నిరసన చేయడానికి రాగా వారిని తరిమి తరిమి కొట్టడంతో తరువాత రోజు పవన్ కళ్యాణ్ వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టడం ఇలా పార్టీకి గట్టిగా డ్యామేజి జరిగినట్లు అనుకుంటున్నారు. ఈ పరిణామాలతో రాబోయే రోజులలో ద్వారంపూడికి ప్రభుత్వంలో ఎటువంటి పదవి ఇచ్చేది లేదని తెలుస్తుంది. ద్వారంపూడి ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను అలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరితే మంచిదని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ద్వారంపూడి ఒక్కసారిగా ఈ విధంగా మాట్లాడటంతో వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •