తెలంగాణ నుండే కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణాలో ప్రతిష్టాత్మక జినోమ్ వ్యాలీలోని ఫార్మా సంస్థలు కరోనాకు మందు తెచ్చేందుకు శ్రమిస్తున్నాయని.. వారి సృష్టి ఫలిస్తే ఆగష్టు లేదా సెప్టెంబర్ లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ నుండి మహిమా దాట్ల ‘శాంతాబయోటెక్’ ఎండీ వరప్రసాద్ రెడ్డి ఇటీవల తనతో మాట్లాడారని వారంతా చాలా సీరియస్ గా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నారన్నారు.

ఇక ఆగష్టుకే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని తనతో వరప్రసాద్ రెడ్డి చెప్పారని ఇదంతా సవ్యంగా జరుగుతుందని తాము 100 శాతం సక్సస్ అవుతామన్న నమ్మకాన్ని ఆయన తెలియచేశారని కేసీఆర్ చెప్పారు.

వైసీపీలో చేరికపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..!

కరోనా వైరస్ చికిత్సలో సరికొత్త విషయాన్ని కనుగొన్న షికాగో వైద్య నిపుణులు..!