వైఎస్ జగన్ ఇజ్రాయెల్ టూర్ ముగించుకొని విజయవాడ వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. మొదటగా సీఎం టూర్ రెండు రోజులనే వ్యాఖ్యలు వినపడగా… ఇక సీఎం మరో రోజు ఢిల్లీలోనే ఉండబోతున్నారని చెప్పగా ఢిల్లీలో సీఎం ఏమి చేస్తున్నారు… ఎవరితో చర్చలు చేస్తున్నారన్న విషయాలపై వైసీపీలో కన్నా… తెలుగుదేశం పార్టీకి ఆసక్తికరంగా మారింది. ఇక మరో రోజు పెంచుకోవడానికి సుష్మ స్వరాజ్ కు నివాళులు అర్పించడానికి ఆమె చనిపోవడంతో ఢిల్లీలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీలో ప్రధాని మోదీతో మరోసారి భేటీ అవ్వడానికే తన టూర్ పొడిగించుకున్నారట.

ప్రధాని మోదీ కూడా జగన్ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై చెప్పిన వాటిని విన్నారని, చంద్రబాబు నాయుడు చేసిన దోపిడీతో అతలాకుతలమైపోయిన, రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పడంతో… ప్రధాని మోదీ మాత్రం ఏపీకి తాము పూర్తిగా సహకరిస్తామని, అవినీతి లేకుండా స్వచ్ఛమైన పాలన వైపు పరుగులు తీయాలన్న నీ తపన నాకు నచ్చిందని చెప్పడంతో పాటు… నీ వెనుక తాను ఉన్నానని ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జగన్ కు భరోసా ఇచ్చారట.

ఇక ఇదే భేటీలో మరి కొన్ని కీలక అంశాలపై కూడా మాట్లాడుకొని… చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాడో… పూర్తి ఆధారాలు అందించారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కానీ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టిపెట్టేలా ఇద్దరి మధ్య భేటీ జరగడంతో.. జగన్ కోరిక మేరకు మరికొన్ని విషయాలు మాట్లాడటానికి మరో రోజు అప్పాయింట్మెంట్ ఇవ్వడంతో జగన్ ఢిల్లీలోనే ఉండిపోయారు. చంద్రబాబు నాయుడు మాత్రం సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లి… ప్రధానిని కలిస్తే అప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునట్లు తనపై చాడీలు చెప్పడానికే జగన్ ఢిల్లీ వెళ్తున్నాడని గగ్గోలు పెడుతున్నాడు. గత ఐదేళ్లలో నీతిమంతమైన పాలన అందిస్తే ఇలా చంద్రబాబు నాయుడుపై చాడీలు చెప్పవలసిన పనేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.   అంటే గత ఐదేళ్లు చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కన్నా ముఖ్యంగా జగన్ ను జైలులో వేయించమని అడగడానికి ఢిల్లీ వీధుల చుట్టూ చక్కర్లు కొట్టారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •