వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని చేపట్టిన తరువాత ప్రతిపక్షాలకు ఎలాంటి చిన్న అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళుతున్నారు. అవినీతి విషయంలో అయితే వెనకడుగు వేయకుండా మొండిగా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ లక్ష కోట్ల ఆరోపణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ మచ్చను తొలగించుకోవడంతో పాటు ప్రతిపక్షాలకు తావివ్వకుండా నడుస్తున్నాడు.

ఇందులో భాగంగా ఒక యువ ఎంపీ విషయంలో జగన్ ఇప్పుడు కాస్త కఠినంగా ఉంటున్నారట. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఢిల్లీ లెవెల్ లో సీఎం జగన్ ఎక్కడకి వెళుతున్న పక్కన ఆ యువ ఎంపీ ఉండేవాడు. కానీ ఆ యువ ఎంపీ అధికారంలోకి రావడంతో డబ్బే సంపాదన ద్యేయంగా ఇసుకపై కన్నేశాడని, ఇసుక అక్రమ తరలింపును ప్రోత్సహిస్తున్నాడని… వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఇప్పుడే డబ్బు సంపాదించేయాలని ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఇలా మొదలెట్టడంతో సీఎం జగన్ కు తెలిసి ఇప్పుడు దూరం పెడుతున్నారట.

ఆ యువ ఎంపీ ఈ మద్య సీఎం జగన్ నిర్వహిస్తున్న మీటింగ్స్ లో కనపడటం లేదని, జగన్ కు దగ్గరగా ఉండేవారి నుంచి ఒకరకంగా ఆ ఎంపీని తప్పించినట్లు వార్తలు వినపడుతున్నాయి. సీఎం జగన్ ఇలా దూరం పెట్టడంతో మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ పాటిస్తున్న రూల్స్ చూసి హడలిపోతున్నారట. ఇలా ఇసుక మీద చూసి చూడనట్లు వ్యవహరించాల్సింది పోయి ఇంత కఠినంగా అంటే ఎలా అని అంటున్నారని తెలుస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా అందుబాటులోకి వస్తే అందరూ దారిలోకి వస్తారని, ఇలా అవినీతి చేసుకుంటూ పోతే రాబోయే రోజులలో తన ప్రభుత్వానికే ముప్పని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •