గూగులే పే ద్వారా మీరు ఇతరులకు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చే గిఫ్ట్ ఓచర్లుతో పాటు మీకు ఆఫర్ కింద నేరుగా మనీ ఇవ్వనుండటంతో చాల మంది ఇప్పుడు మనీ ట్రాన్సక్షన్స్ లాంటివి గూగుల్ పే నుంచి చేస్తుంటారు. గూగుల్ పే వలే. ఫోన్ పే యాప్ కూడా చాల మంది ఉపయోగించి డబ్బులు సంపాదిస్తుంటారు.

ఇక గూగుల్ పే సంస్థ దీపావళి సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక ఆఫర్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక ఐదు స్టాంపులను గూగుల్ పే యాప్ లో ప్రవేశ పెట్టి వాటిని కనుక కలెక్ట్ చేస్తే మీకు 251 రూపాయల నుంచి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు తెలియచేసేయడంతో అందరూ సరదాగా ఉండటంతో పాటు డబ్బులు కూడా సంపాదించవచ్చని సోషల్ మీడియా వ్యాప్తంగా తమ దగ్గర లేని స్టాంప్ కోసం స్నేహితులకు రిక్వెస్ట్ పెడుతూ విపరీతంగా షేర్లు చేసుకుంటూ మంచి ట్రెండీ చేసేసారు. దీనివలన మనం డబ్బులు సంపాదించుకోవడంతో పాటు, గూగుల్ పే సంస్థకు మంచి ప్రమోషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఐదు స్టాంప్స్ ను వివిధ రూపాలలో సంపాదించుకోవచ్చు. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆఫర్ నిన్న అక్టోబర్ 31తో ముగుస్తుందని ముందుగా చూపిన నవంబర్ 11 వరకు పొడిగించడం జరిగింది.

దీపావళి స్టాంప్స్ పొందే పద్ధతులు

మొదటి పద్ధతి :

పేటీఎంలోకి వెళ్లి డబ్బులను యాడ్ చేయండి, మీ వాలెట్ కు 50 రూపాయల కన్నా ఎక్కువగా యాడ్ చేసినప్పుడు, మీరు ఎక్కడైనా అవసరాల కోసం మనీ ఉపయోగిస్తే గూగుల్ పే UPI ఉపయోగించి డబ్బుని చెల్లించినట్లైతే ఫ్లవర్ లేదా రంగోలి స్టాంప్ ను పొందే అవకాశం ఉంది.

రెండవ పద్ధతి :

అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ నుండి కనీసం 50 రూపాయలు అంతకంటే ఎక్కువ BHEEM UPI ఉపయోగించి చెల్లించి మరియు మీ గూగుల్ పే అడ్రస్ జోడించి గూగుల్ పే ద్వారా చెల్లించండి. ఈ పద్ధతిని ఉపయోగించినా ఫ్లవర్ లేదా రంగోలి పొందే అవకాశం ఉంది.

మూడవ పద్ధతి :

రీఛార్జ్ చేసుకుకునేటప్పుడు బిల్ పేమెంట్స్ గూగుల్ పే ద్వారా 35 రూపాయలకు పైగా చెల్లింపులు చేయండి

నాలుగవ పద్ధతి :

CRED యాప్ డౌన్లోడ్ చేసుకొని, CRED లో సైన్అప్ చేయండి మరియు క్రెడిట్ కార్డు జోడించి మీ క్రెడిట్ కార్డు బిల్ చెల్లించండి. ఇలా బిల్ పే చేసే సమయంలో గూగుల్ పే యాప్ ఉపయోగించి చేయడంతో ఫ్లవర్ లేదా రంగోలి సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఐదవ పద్ధతి :

మీకు తెలిసిన బిజినెస్ క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ పే లేదా గూగుల్ పే, పేటీఎం లలో ఏదో ఒక క్యూఆర్ కోడ్ సేవ్ చేయండి. గూగుల్ పేకు వెళ్లి గూగుల్ పే క్యూఆర్ స్కానర్ ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. 50 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉపయోగించి స్కాన్ చేసి స్టాంపులను గెలుచుకునే అవకాశం పొందండి.

ఆరవ పద్ధతి :

దీపావళి స్కానర్ ను గూగుల్ పే ద్వారా ఉపయోగించి రోజుకు ఐదు దీపావళి వస్తువులను స్కాన్ చేసే సదుపాయం ఉంది. వీటి ద్వారా కూడా ఐదు స్టాంపులను కలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఐదు స్టాంపులలో ఫ్లవర్, రంగోలి స్టాంపులు కలెక్ట్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. ఫ్లవర్ స్టాంప్ కూడా ఎలాగైనా సాధించిన రంగోలి స్టాంప్ సాధించాలంటే లక్ కలిసిరావాలి. నిన్నతో ముగుస్తుందని చెప్పిన దీపావళి ఆఫర్ నవంబర్ 11వరకు పొడిగించడంతో రంగోలి స్టాంప్ కోసం మీ ప్రయత్నాలు మరొక 11 రోజులు కొనసాగించి మంచి ఆఫర్ పొందండి.