కరోనా వైరస్ తో దేశం అతలాకుతలం అవుతుంటే దీని కంటే మరో ప్రమాదకరమైన వ్యాధి ఇండియాలో బయట పడింది. అతిభయంకరమైన ‘కాంగో ఫీవర్’ మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గుజరాత్ సరిహద్దులోనే ఈ జిల్లా ఉన్న నేపథ్యంలో అక్కడ నుండి మహారాష్ట్రలోకి ఈ వ్యాధి సోకకుండా అధికారులు అప్రమత్తమయి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుజరాత్ లోని పలు జిల్లాలో ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున జ్వరాలతో భాదపడుతున్నారు. ఇప్పటికే కొందరు మరణించినట్లుగా తెలుస్తుంది.

సాధారణంగా కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తిచెందుతుంది. ఇది పశువుల పెంపకం దారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఇది ఆందోళన కలిగించే విషయమని.. దీనికి సరైన మందులు, వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులు సూచించారు.

ఇక ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేలు ద్వారా ఒక జంతువు నుండి మరొక జంతువుకు వ్యాపిస్తుందని.. వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారా కానీ వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని కానీ తినడం ద్వారా ఇది మానవులకు వ్యాపిస్తుందని.. కావున జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ వ్యాధిని నిర్ధారించి చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారని అధికారులు తెలియచేసారు.

congo fever

కేవలం నిమిషాల వ్యవధిలోనే కరోనా నిర్ధారణ పరీక్ష.. నూతన విధానాన్ని ఆవిష్కరించిన WHO

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!