ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మొదటి విడత జాబిత తనకు నచ్చిన, మెచ్చిన అర్ధరాత్రి సమయంలో 65 మందితో విడుదల చేసింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రులు నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా చెప్పుకోవచ్చు. అప్పట్లో తెలంగాణ నిర్ణయం కూడా అర్ధరాత్రి సమయంలోనే జరిగింది.

 

మహాకూటమిలో భాగంగా తెలంగాణాలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలలో 26 స్థానాలు కూటమిలో భాగస్వామ్య పక్షాలకు ఇవ్వగా మిగిలిన 93 స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. వీటిలో ఇప్పుడు 65 ప్రకటించి, మిగిలిన 28 స్థానాల విషయంలో ఇంకా సందిగ్దత నెలకొని ఉండటంతో వాయిదా వేసింది. ఇప్పుడు ప్రకటించిన 65 స్థానాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఇక ఈ రోజు లేదా రేపు ప్రకటించబోయే 28 స్థానాలలోనే నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాల ఎంపికపైనే కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. టిఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన కొండా సురేఖకు పరకాల సీటు కేటాయించగా, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తన కొడుకుకి మిర్యాలగూడ టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నా దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టారు. ఇక అనుకునట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుడు చిరుముర్తి లింగయ్యకు నకిరేకల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో తన పలుకుబడి ఏమిటో నిరూపించారు.

కాంగ్రెస్ పార్టీ 65 మంది అభ్యర్థుల జాబిత :

  • సిర్పూర్‌    – డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు  
  • చెన్నూరు(ఎస్సీ)    – డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట
  • మంచిర్యాల     – కె.ప్రేమ్‌సాగర్‌రావు
  • ఆసిఫాబాద్‌(ఎస్టీ)  – అత్రం సక్కు
  • ఆదిలాబాద్‌  – సుజాత గండ్రాత్‌
  • నిర్మల్‌   – ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
  • ముథోల్‌   – రామారావు పటేల్‌ పవార్‌
  • ఆర్మూర్‌   – ఆకుల లలిత
  • బోధన్‌    – పి.సుదర్శన్‌రెడ్డి
  • జుక్కల్‌ (ఎస్సీ)  – ఎస్‌.గంగారాం
  • బాన్సువాడ  – కాసుల బాల్‌రాజు
  • కామారెడ్డి   – షబ్బీర్‌ అలీ
  • జగిత్యాల  – జీవన్‌ రెడ్డి
  • రామగుండం –   ఎం.ఎస్‌.రాజ్‌ ఠాకూర్‌
  • మంథని  – శ్రీధర్‌బాబు దుద్దిళ్ల
  • పెద్దపల్లి  – సీహెచ్‌ విజయరమణారావు
  • కరీంనగర్‌   – పొన్నం ప్రభాకర్‌
  • చొప్పదండి(ఎస్సీ)  – డాక్టర్‌ మేడిపల్లి సత్యం
  • వేములవాడ   – ఆది శ్రీనివాస్‌
  • మానకొండూరు (ఎస్సీ)   – ఆరేపల్లి మోహన్‌
  • అందోల్‌æ(ఎస్సీ)   – దామోదర రాజనర్సింహ
  • నర్సాపూర్‌   – వి.సునీతాలక్ష్మారెడ్డి
  • జహీరాబాద్‌ (ఎస్సీ)  – డాక్టర్‌ జె.గీతారెడ్డి
  • సంగారెడ్డి  – జగ్గారెడ్డి
  • గజ్వేల్‌   – ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
  • కుత్బుల్లాపూర్‌   – కూన శ్రీశైలంగౌడ్‌
  • మహేశ్వరం   – పి.సబితాఇంద్రారెడ్డి
  • చేవెళ్ల (ఎస్సీ)   – కేఎస్‌ రత్నం
  • పరిగి   – టి.రామ్మోహన్‌రెడ్డి
  • వికారాబాద్‌ (ఎస్సీ)   – గడ్డం ప్రసాద్‌కుమార్‌
  • తాండూరు  – పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డి
  • ముషీరాబాద్‌  – ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌
  • నాంపల్లి   – ఫిరోజ్‌ఖాన్‌
  • గోషామహల్‌  – ఎం.ముఖేశ్‌గౌడ్‌
  • చార్మినార్‌  – మహ్మద్‌ గౌస్‌
  • చాంద్రాయణగుట్ట   – ఈస మిస్రి
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – సర్వే సత్యనారాయణ
  • కొడంగల్‌   – రేవంత్‌రెడ్డి
  • జడ్చర్ల  – డా. మల్లు రవి
  • వనపర్తి  – డాక్టర్‌ జి.చిన్నారెడ్డి
  • గద్వాల్‌    – డీకే అరుణ
  • అలంపూర్‌ (ఎస్సీ)   – సంపత్‌కుమార్‌
  • నాగర్‌కర్నూల్‌   – నాగం జనార్దన్‌ రెడ్డి
  • అచ్చంపేట(ఎస్సీ)   – సీహెచ్‌ వంశీకృష్ణ
  • కల్వకుర్తి    – డా. వంశీచంద్‌ రెడ్డి
  • నాగార్జునసాగర్‌   – కె.జానారెడ్డి
  • హుజూర్‌నగర్‌   – ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
  • కోదాడ   – ఎన్‌.పద్మావతిరెడ్డి
  • సూర్యాపేట   – ఆర్‌.దామోదర్‌రెడ్డి
  • నల్లగొండ  – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • మునుగోడు  – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • భువనగిరి    – కె.అనిల్‌కుమార్‌రెడ్డి
  • నకిరేకల్‌(ఎస్సీ)   – చిరుమర్తి లింగయ్య
  • ఆలేరు   – బి.భిక్షమయ్యగౌడ్‌
  • స్టేషన్‌ఘన్‌పూర్‌(ఎస్సీ)   – సింగపూర్‌ ఇందిర
  • పాలకుర్తి   – జంగా రాఘవరెడ్డి
  • డోర్నకల్‌(ఎస్టీ)   – డాక్టర్‌ జె.రామచంద్రునాయక్‌
  • మహబూబాబాద్‌(ఎస్టీ)   – పోరిక బలరాంనాయక్‌
  • నర్సంపేట  – దొంతి మాధవరెడ్డి
  • పరకాల  – కొండా సురేఖ
  • ములుగు(ఎస్టీ)   – సీతక్క
  • పినపాక(ఎస్టీ)   – రేగ కాంతారావు
  • మధిర(ఎస్సీ)   – మల్లు భట్టి విక్రమార్క
  • కొత్తగూడెం   – వనమా వెంకటేశ్వర్‌రావు
  • భద్రాచలం(ఎస్టీ)  – పోడెం వీరయ్య