చైనాలో కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఈ వైరస్ భారిన పడి 1770 వందల మంది మరణించారు. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ వైరస్ దాదాపు 25 దేశాలకు విస్తరించింది. ఇక తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 70000 సోకింది. అయితే ఈ వైరస్ ను 40 ఏళ్ళ క్రితమే ఊహించారట. అమెరికాకు చెందిన రచయత డీన్ కూంట్జ్ రచించిన ఐస్ అఫ్ డార్క్ నెస్ నవలలో ఈ వైరస్ ప్రస్తావన ఉంది. అంటే కరోనా అని కాకుండా వుహాన్-400 అని ఉంది.

ఓ ల్యాబ్ లో తయారైన బయో ఆయుధంగా రచయత తన పిక్షన్ నవలలో పేర్కొన్నాడు. అయితే ఈ నవలలో ఈ వైరస్ అత్యంత తీవ్రమైందిగా పేర్కొనడం జరిగింది. దీని కారణంగా 100 శాతం మరణాలు సంభవిస్తాయని పేర్కొనడం జరిగింది. ఇక ఈ పుస్తకంలో వుహాన్ ప్రస్తావన ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ దీన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •