తెలుగు రాష్ట్రాలలో రాబోయే నాలుగు రోజులు ఒక మోస్తరు నుంచి బారి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు యానాం, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. దీనితో ప్రజలంతా కరోనా వైరస్ బారిన పడకుండా మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. కరోనా వైరస్ అనేది చలిగాలులు మరింత ఎక్కువగా విస్తరిస్తుందని, ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకే ప్రమాదముందని ఇప్పటికే వైద్యులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్ లో మామూలుగానే దగ్గులు, జలుబులు అధికంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి లక్ష్యణాలు ఉంటే కరోనా అని భయపడుతున్న సందర్భంలో అవసరానికి మించి బయటకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీటిని తాగుతూ, ఆవిరి పట్టుకుంటూ ఇంట్లోనే కాలక్షేపంగా చేయడం అవసరం. ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుందనటంతో పాటు వైరస్ అనేక రూపాలలో ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా వ్యాధి నిర్ధారణ అవుతుంటే మరికొంతమందికి తీవ్ర అలసటతో పాటు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అసలు కొంతమంది తాము బయటకు వెళ్లడం లేదని, కానీ తమకు కరోనా వైరస్ సోకుంతుందనే కేసులు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. రాబోయే రోజులలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రిలో బెడ్స్ కూడా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకొని దిక్కుమాలిన కరోనా రాకాసి నుంచి కాపాడుకోండి.

ఇక నుండి టెలిగ్రామ్ లో వీడియో కాల్, వాట్సాప్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం

నగ్నంగా కనిపించనున్న శ్రద్ధా కపూర్, ఎంత డేరింగ్ బాసు

నిర్మాతలు ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు, మరి థియేటర్ల పరిస్థితి ఏమిటో