ఐపీఎల్ అంటేనే చీర్ గర్ల్స్ హడావిడి, అరుపులు కేకలు, డీజే సాంగ్స్ అబ్బో వ్యవహారం మాములుగా ఉండదులే. మరొక వైపున ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే సమయంలో వారితో ఇంటర్వ్యూలు గట్రా ఇలా అభిమానులను ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. కానీ ఈ ఏడాది కరోనా దెబ్బతో భారత్ లో జరగవలసిన ఐపీఎల్ ఆరు నెలలు లెట్ గా దుబాయ్ లో ప్రారంభమవ్వడంతో పాటు ఇప్పటికే కొంతమంది సభ్యులు కరోనా బారిన పడి బాధపడుతుండటంతో మీడియాకు పర్మిషన్ లేదని చెప్పేశారట.

స్టేడియంలోకి మీడియాకు అనుమతి లేదని, నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లను కలుసుకోవడానికి వీలు లేదని, కరోనా వైరస్ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అనేక మీడియా సంస్థలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తం తమ ఆటగాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని టీమ్ మేనేజిమెంట్ లు కూడా భావిస్తుండటంతో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సరే కనీసం చీర్ గర్ల్స్ హడావిడైనా ఉంటుందా అంటే దానికి కూడా పర్మిషన్ లేదని తెలుస్తుంది.