కరోనా వైరస్ మహమ్మారి గత రెండు నెలలుగా ప్రపంచం మొత్తాన్ని బాధిస్తుంటే, కరోనా భయంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అతడి పుత్రరత్నం మాత్రం హైదరాబాద్ లోని వారి నివాసంలో సేదతీరుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన కొత్తలో నారా లోకేష్ బయటకు వచ్చి తన కొడుకుతో సైకిల్ తొక్కుతూ కనపడ్డాడే తప్ప ఇంతవరకు చంద్రబాబు మాత్రం జూమ్ వీడియోలో తప్ప ప్రజలకు నేరుగా అందుబాటులో లేడు.

చంద్రబాబు నాయుడుకి వయస్సు మీద పడటంతో పాటు ముసలితనం వచ్చేయడంతో బయటకు వస్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని తన ప్రాణానికి ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో అని కలుగులోనే దాక్కున్నారు. అసలే చంద్రబాబు నాయుడుకి అధికారమంటే పిచ్చి, ఆ పిచ్చి వ్యామోహంతో ఎన్నెన్నో పనులు చేసాడు…. ఇంకెన్నెన్నో పనులు చేసి తన కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలన్న కలైతే ఉంది.

కరోనా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత వైరస్ కేసులు మరింత పెరగడంతో ఇప్పట్లో ఏపీకు పెదబాబు, చినబాబు వచ్చే సూచనలు కనపడటం లేదు. మరీ ముఖ్యంగా వృద్ధులకు కరోనా వైరస్ సోకితే తగ్గే సూచనలు లేవని, వైద్యులు చెప్పడంతో బాబు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడం లేదట. లాక్ డౌన్ సడలింపులనివ్వడంతో చాలా మంది హైదరాబాద్ నుంచి వారివారి స్వస్థలాలకు వెళుతూ వారి ప్రాంతంలో క్వారంటైన్ లో 14 రోజులు ఉంటున్నారు.

చంద్రబాబు మాత్రం కదలపోవడానికి కారణం కూడా క్వారంటైన్ బాధ ఒకటని చెప్పుకోవచ్చు. ఒకవేళ బయటకు వచ్చి క్వారంటైన్ లో ఉండాలన్న నియమం ఉండటంతో ఏపీకి వచ్చే అవకాశాలు లేనట్లే. రాబోయే కొన్ని నెలలు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలనైతే ఆంధ్రకు వచ్చినా నేరుగా కలిసే అవకాశమైతే లేదు. టీడీపీ నేతలు కూడా బాబుకు ఇప్పట్లో అమరావతి వచ్చే ఉద్దేశం లేదని, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాతే వస్తారని చెప్పుకుంటున్నారు

హైదరాబాద్ లో ఉండి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే నెటిజన్స్ మాత్రం ముందు ఆంధ్రకు వచ్చి మాట్లాడమని, హైదరాబాద్ లో కూర్చుని నువ్విచ్చే సలహాలు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సరే చంద్రబాబు అంటే ముసలితనం వచ్చేయడంతో కరోనా వైరస్ కు బయపడుతున్నాడు. లోకేష్ యువ నాయకుడే కదా అతడు ఏపీకి వచ్చి కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఏమిటో ఇబ్బంది.

ఎన్టీఆర్ బాహుబలి అయితే నారా లోకేష్ బల్లాలదేవుడట