కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మన హైదరాబాద్ లో అయితే నిన్న ఒక ల్యాబ్ లో చేఇస్నా టెస్ట్ లావు 70 శాతం మందికి కరోనా పాజిటివ్ రాగా ప్రభుత్వం హడలిపోయింది. ఆ ప్రైవేట్ ల్యాబ్ పై ఎంక్వయిరీ వేసి కరోనా టెస్ట్ లు ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నారనే అనేదానిపై నిజనిర్ధారణ చేయనున్నారు.

కానీ కొన్ని చోట్ల పరిస్థితి ఇలా ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా నెగటివ్ రావడం కలకలం సృష్టిస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలా ఉన్న ఢిల్లీలోని ఒక వైద్యుడు కరోనా టెస్ట్ లు చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. కానీ ఇంతకు వైరస్ లక్షణాలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో మరోసారి టెస్ట్ చేయించుకున్నా నెగెటివ్ రావడం జరిగింది. కానీ అతడు ఆ తరువాత రోజే గుండెపోటుతో మరణించడంతో తీవ్ర విశాదంగా మారింది.

దీనితో ఇప్పుడు వైద్యులు ఇలా జరగడంపై కాస్త లోతుగా విశ్లేషిస్తున్నారు. కరోనా టెస్ట్ శాంపిల్స్ లో లోపాలున్నాయా లేక వైరస్ నిర్ధారణ కావడం లేదా ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై సరికొత్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో చాలా చోట్లా పాజిటివ్ రావాల్సిన కేసులు నెగెటివ్… ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ ఇలా రావడంతో వైరస్ కు వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనా భయం నుంచి బయటపడలేమని అంటున్నారు.

కొడుకులు, కోడళ్ల ఛీత్కారంతో బతికి చెడ్డ ఒక పెద్దాయన కన్నీటి గాధ