ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో మొత్తం ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 3791కి చేరింది. ఇక ఇప్పటివరకు 2209 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 927 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 64 మంది కరోనా భారిన పడి మృతి చెందారు. అయితే ఈరోజు వచ్చిన 113 కేసుల్లో గుంటూరు నగరంలోనే 23 పాజిటివ్ కేసులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

గుంటూరులో ఓ కూరగాయల మార్కెట్ నుండి 18 మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తుంది. దీంతో కూరగాయలు అమ్మే ఓ వ్యాపారి నుండి 18 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఆ కూరగాయల వ్యాపారితో పాటు అతని ఇంట్లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా కూరగాయల వ్యాపారి పక్కింట్లో ఉండే ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇలా మార్కెట్లో ఓ వ్యాపారి నుండి 26 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో మార్కెట్లోని అన్ని దుకాణాలను మూసి వేశారు. ఇక దీంతో ఆ మార్కెట్లోని మొత్తం 250 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 18 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

కరోనాకు మందు కనిపెట్టానంటున్న టాలీవుడ్ దర్శకుడు.. ట్రయల్స్ కోసం కేసీఆర్‌కు లేఖ..!

కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్ తప్పని సరి.. కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం..!