కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి ఇప్పుడు చాలా దేశాలు వైరస్ మహమ్మారి నుంచి కాస్త బయటపడుతుంటే అమెరికా, ఇండియా మాత్రం వైరస్ దెబ్బకు ఇంకా కకావికలమైపోతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నవారితో రోజు రోజుకి ఆందోళన పెరగడంతో పాటు భారత్ లో చాలా రాష్ట్రాలు ఇప్పటికే మరొకసారి పూర్తి లాక్ డౌన్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.

ఈ కరోనా వైరస్ ఎంతటి ఘాతుకానికి పాల్పడుతుందంటే కరోనా బారిన పడిన వారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని తమ పరిశోధనలో తేలినట్లు రష్యాలోని మాస్కోకు చెందిన చీఫ్ గైనకాలజిస్ట్ ఎలినా తెలియచేస్తున్నారు. పురుషులలో ఎక్కువగా వంధత్వం(ఇన్ ఫెర్టిలిటీ) సమస్య వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక అటు వీర్య కణాలలోకి వైరస్ వెళ్తుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. దీనితో యువత కరోనా వైరస్ బారిన పడకుండా మరింత జాగ్రత్తుగా ఉండవలసిన అవసరం ఉంది.

ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వారు సరైన ఆహారం తీసుకుంటే కరోనాను సులువుగా జయించవచ్చు. కరోనా మరణాలు ముఖ్యంగా 60 ఏళ్ళ వయస్సు దాటినా వారిపై మాత్రమే ప్రభావం చూపిస్తుండటంతో కరోనా వైరస్ కనుక ఒకసారి ఎవరికైనా సోకినా ఇలా వీర్య కణాల వృద్ధితో పాటు మరికొన్ని రోగాలు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. కావున ప్రతిఒక్కరు మాస్క్ ధరించి బయటకు వెళ్లడం ఉత్తమమైన పని.