దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3561 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 52952 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 89 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 1783 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 15267 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 35902 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ లో గత ఐదు రోజుల నుండి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాగా దేశంలో వైరస్ భారిన పడి కోలుకున్న వారి శాతం 25.36 గా ఉంది. ఇక రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులోనే 1233 కొత్త కేసులు నమోదవడంతో 34 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16758 కి చేరగా, 651 మంది మృతువాత పడ్డారు. ఇక తమిళనాడులో కూడా గత నాలుగు రోజుల నుండి కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 771 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4829 కి చేరింది. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ లలో కూడా కరోనా తీవ్రంగా పెరుగుతుంది.

ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఏపీలో ఇప్పటివరకు 1777 మంది కరోనా భారిన పడగా, 36 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. కాగా 729 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 1026 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణాలో నిన్న కొత్తగా 11 కేసులు నిర్ధారణ కావడంతో దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1107 కి చేరగా, 29 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు.

ట్రక్కులో ప్రేమికులు రహస్యంగా వెళ్తుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

ఆర్ఆర్ వెంకటాపురంలో భయానక వాతావరణం..!

ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ..!