కరోనా వైరస్ పరీక్షల కోసం ఆన్లైన్ బుకింగ్ ను ప్రారంభించారు. కొత్తగా కేంద్రప్రభుత్వం ఆమోదంతో ప్రాక్టో వైద్యపరీక్షల సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనా వైరస్ బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు కరోనా పరీక్షలు అందుబాటులో ఉంచేందుకు ఈ ఆన్లైన్ ను తీసుకువచ్చారు.

కరోనా పరీక్షలు భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీచర్చ్ ఆమోదంతో బెంగుళూర్ కు చెందిన ప్రాక్టో సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు వీలుగా థైరో కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వైద్యుడి ప్రిస్క్రిప్షన్, వైద్యుడు సంతకం చేసిన టెస్ట్ రిక్విజిషన్ ఫారం, వ్యక్తి ఫొటో ఐడి కార్డును సమర్పిస్తే 4500 రూపాయలతో కరోనా పరీక్ష చేస్తారు. ఇక ఇప్పటికే ముంబయిలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు దేశంలో మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించబోతున్నారు.

కరోనా పరీక్షకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఐ2 హెచ్ నుంచి సర్టిఫైడ్ ఫైబోటోమిస్టులు రోగుల ఇళ్లకు వచ్చి నమూనాలను సేకరించి వాటిని థైరోకేర్ ప్రయోగశాలలో పరీక్షల కోసం తరలిస్తారు. రోగి నమూనా సేకరణ జరిగిన 48 గంటల లోపు ప్రాక్టో వెబ్‌సైట్‌లో పరీక్షల నివేదిక కరోనా రోగులకు అందుబాటులో ఉంచుతామని.. ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ అలెగ్జాండర్ కురువిల్లా చెప్పారు.