కొన్ని దేశాలలో జులై, ఆగస్ట్ నెలలలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనపడినా ఇప్పుడు మరోసారి తన స్వభావాన్ని మార్చుకొని మరోసారి దాడి చేయడంతో ఇప్పుడు ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ బ్రిటన్ లో పూర్తి స్థాయిలో తగ్గి పోవడంతో అన్ని కార్యక్రమాలు గతంలోలా యధావిధిగా నడుస్తున్నాయి. కానీ గత వారంలో రోజుకి 3200 కేసులు చొప్పున నమోదైతే అవి ఇప్పుడు ఏకంగా ఆరు వేల కేసులకు చేరుకున్నాయి.

ఇలా ఒక వారం ముగిసే సరికి కేసులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో అక్కడ ప్రభుత్వం భయాందోళనకు గురవుతుంది. ముఖ్యంగా ఉత్తర ఇంగ్లాండ్, లండన్ లలో రోజుకి ఆరు వేల కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చేరే రోగులు ప్రతి 8 రోజులకు రెట్టింపు కావడంతో మరోసారి లాక్ డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్లు అక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గదని దానిపై జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత చెబుతున్నా కొన్ని దేశాలలో కరోనా పూర్తిగా తగ్గిపోయిందని ఇక సాధారణ జీవితం గడుపుతుండటంతో ఇలా ఒక్కసారిగా కరోనా వైరస్ చుట్టుముట్టి ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తుంది. అమెరికాలో కూడా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజ్రంభిస్తుందని తెలుస్తుంది. మన దేశంలో అయితే తగ్గడం అన్న మాటే లేకుండా రోజు రోజుకి కేసులు పెరుగుతూనే పోతున్నాయి. కానీ గతంతో పోలిస్తే కరోనా వైరస్ సోకినవారి త్వరగా కోలుకోవడంతో పాటు, మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

గంగవ్వకు కరోనా వైరస్ రూమర్లపై నిజమెంత?

విజయసాయిరెడ్డి కెలుకుడు మాములుగా లేదుగా, చివరకి ఎవరి తీగ తెగుతుందో

రాజుగారి ఉత్సాహం చూస్తుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నారే