కరోనా వైరస్ ఎంతలా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందో ఈ ఉదంతం మరొక ప్రత్యక్ష నిదర్శనం. అసలు కరోనా ఎవరకి ఉందొ… ఎవరకి లేదో కూడా తెలియడం లేదని అధికారులు మధనపడుతున్నారు. గుంటూరులో ఒక వ్యక్తి ఇతర ఆరోగ్య సమస్యల వలన 6వ తేదీన గుంటూరు జీజీహెచ్ లో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ పొందుతూ 8న మరణించాడు. ఇక ఆ తరువాత రోజు స్వగ్రామానికి తీసుకొని వచ్చి అంత్యక్రియలు జరిపారు.

కానీ నిన్న అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. అతడు ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చనిపోతే ఇప్పుడు పాజిటివ్ రావడం కలకలాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు అంత్యక్రియలలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఇలా పాజిటివ్ అని రావడంతో కరోనా వైరస్ చాలా రూపాలలో మనల్ని చుట్టేస్తుందని తెలుస్తుంది.

ఇలాంటి సంఘటన మరొకటి గుంటూరులోనే జరగడంతో ఇతర ఆరోగ్య సమస్యలతో చనిపోయిన వారికి కరోనా లేదని భావిస్తే పరిణాలమాలు తీవ్రంగా ఉంటాయని అర్ధమవుతుంది. ఇలా కరోనా వైరస్ అనేక రూపాలలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలా ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలో తెలియక ప్రపంచ ఆరోగ్య సంస్థ మధనపడుతుంది. గాలిలో కూడా కరోనా వైరస్ లక్ష్యణాలు కొన్ని గంటల పాటు ఉంటాయని చెప్పడం చూస్తుంటే, కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా అని ప్రజలు రోజు రోజుకి మరింత ఆందోళన చెందుతున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్నాయని రాబోయే రోజులలో రోజుకి లక్ష నుంచి రెండు లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.