కరోనా వైరస్ ప్రపంచదేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ కరోనా భారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి కుత్రిమ శ్వాస అందించేందుకు అవసరమైన ఆక్సిజన్ వెంటిలేటర్ల సమస్య ఎక్కువుగా ఉంది. ఇక ఇండియాతో పటు పలు దేశాలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. అయితే అందరికి వెంటిలేటర్లు అవసరం లేకుండా ఎవరికి అవసరమే ఎవరికి అవసరం లేదో కనుగునేందుకు వీలుగా రోగుల రక్తంలోని ఓ ప్రోటీన్ ను షికాగో వైద్య నిపుణులు కనుకొన్నారు.

అమెరికాలోని నెంబర్ వన్ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన షికాగోలో ‘రష్‌ యూనివర్శిటీ’ మెడికల్‌ సెంటర్స్ వైద్య నిపుణులు బృందం తెలియచేసిన వివరాల ప్రకారం.. రోగుల రక్తంలో సుపార్ అనే ప్రోటీన్ స్థాయి 6ఎన్‌జీ–ఎంఎల్ అంతకంటే ఎక్కువ ఉన్నట్లు అయితే వారికి రోగం తీవ్రత ఎక్కువుగా ఉన్నట్లని వారికి ఆక్సిజన్ వెంటిలేటర్లు అమర్చాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇక రోగం తీవ్రత తక్కువుగా ఉన్నవారిలో సుపార్ ప్రోటీన్ స్థాయి 5ఎన్‌జీ–ఎంల్ ఉంటుందని వారికి ఆక్సిజన్ వెంటిలేటర్లు అమర్చాల్సిన అవసరం లేదని కనుగొన్నారు. సుపార్ స్థాయి పెరిగిపోయినట్లయితే రోగనిరోధక శక్తీ తగ్గిపోయి రోగతీవ్రత పెరిగినట్లేనని వైద్యనిపుణులు తెలియచేసారు.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చి చంపిన భర్త.. స్థానికంగా తీవ్ర కలకలం..!

వాట్సాప్ లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్.. ఇక ఆ సంస్థలకు గట్టి పోటీ..!

కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆందోళన..!