రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కి చెందిన భారత బయోటెక్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తో కలిసి కరోనాకు ‘కోవాక్సిన్‌’ అనే మందును ఐసీఎంఆర్ తయారు చేస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ ను ఆగష్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఐసీఎంఆర్ అధికారిక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. జంతువులపై ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది. అన్ని క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని ఆగష్టు 15న వ్యాక్సిన్ ను విడుదల చేయాలనుకుంటున్నాం అని తెలిపింది.

ఇందులో భాగంగా భారత్‌ బయోటెక్‌ ట్రయల్స్‌ను ముమ్మరం చేసింది. ఏదేమైనా క్లినికల్ ట్రయల్స్‌ అన్నీ విజయవంతంగా పూర్తైన తరువాతే వ్యాక్సిన్‌ని మార్కెట్‌లోని విడుదల చేస్తామని ఐసీఎంఆర్, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ వ్యాక్సిన్ రాబోతుంది. అంతేకాకుండా వ్యాక్సిన్ పనితీరును ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఇక ఈ వ్యాక్సిన్ వస్తే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరికీ కరోనా సోకె ప్రమాదం ఉండదు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజులోనే 20 వేలకు పైగా కేసులు..!

కరోనా వైరస్ అంతంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్