కరోనా మహమ్మారి ప్రపంచంలో దాదాపు 198 దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారిని నిర్ములించడానికి అనేక ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికి మందు రావడానికి ఇంకా 16 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచంలో అనేక దేశాలతో పాటు అమెరికాలోను కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీని భారిన పడి ఇప్పటికే 3 వేల మంది మృతి చెందగా, 163000 మందికి కరోనా సోకడంతో ఆసుపత్రుల్లో చికిత్య పొందుతున్నారు.

ఇక అమెరికా ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కోసం ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో 3438 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్ అండ్ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(బార్డా), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంతకాలు చేశాయి. కరోనా వ్యాక్సిన్లపై పరిశోధనలకు ఇప్పటికే ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీ 3500 కోట్లను కేటాయించింది. తాజాగా అమెరికా ప్రభుత్వం నుండి ఆర్ధిక సహకారం 3438 కోట్ల లభించడంతో వ్యాక్సిన్ ప్రాజెక్ట్ విలువ 7 కోట్లకు చేరింది.

ఇక ఇందులో భాగంగా 2021 మార్చి నాటికీ 100 కోట్ల డోసుల కోవీద్-19 వ్యాక్సిన్ ను ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ సమకూర్చబోతుంది. ఇక ఈ సెప్టెంబర్ నెలాఖరుకల్లా మనుషులపై ప్రయోగ పరీక్షలను ప్రారంభించి వచ్చే ఏడాది కల్లా వ్యాక్సిన్ ను అందజేస్తామని.. ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ ప్రకటించింది.