కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వైరస్ కు మందు కనుకునే క్రమంలో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు పూర్తి సహకారం అందిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తెలియచేసింది. 40 కోట్ల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం ఖరారైందని మొత్తం 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

ఇక ఈ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ సరఫరా కోసం అమెరికన్ బయోమెడికల్ పరిశోధన అభివృద్ధి సంస్థ నుండి 100 కోట్ల డాలర్ల నిధులు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేపట్టే మూడో విడత క్లినికల్ ట్రయిల్స్ కు సహకరిస్తామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ను అతి త్వరగా సెప్టెంబర్ లోనే ప్రజల ముందుకు తెచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కలసి కృషి చేస్తున్నామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఇక 30000 మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించబోతున్నామని ఆ సంస్థ తెలిపింది.

ఘోర విమాన ప్రమాదం.. విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు

ఊపిరిపీల్చుకున్న చిత్ర యూనిట్.. రెండు నెలలు తర్వాత ఇండియాకు..!