చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఇక ఈ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి పలు దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనాకు ఎవరు ముందు వ్యాక్సిన్ కనిపెడతారోనని ప్రపంచదేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటలీ దేశం శాస్త్రవేత్తలు కరోనాకు మందు కనిపెట్టినట్లు ప్రకటించాయి. తమ శాస్త్రవేత్తలు కరోనాకు మందు కనిపెట్టినట్లు ఇటలీ న్యూస్ ఏజన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. ‘టకీస్’ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగం విజయవంతమయినట్లు వారు తెలియచేసారు. మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో ప్రతి నిరోధకాలును ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. ఇక ఈ వ్యాక్సిన్ ను రోమ్‌లోని స్పల్లాంజనీ ఆస్పత్రిలో పరీక్షించినట్లు ఇటలీ తెలియచేసింది.

ఇక కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇది అత్యంత కీలక దశ అని.. జూన్ లో క్లినికల్ ట్రయిల్స్ జరుగుతాయని అన్నారు. అమెరికా ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్‌తో ‘టకిస్’ మరింత ముమ్మరంగా పరిశోధనలు సాగించనున్నట్లు అరిసిచియో పేర్కొన్నారు. ఇక ఫలితాలు ప్రోత్సహకారంగా అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ శాస్త్రవేత్తలు తెలియచేసారు.

తెలంగాణ నుండే కరోనా వైరస్ వ్యాక్సిన్..!

కరోనా వైరస్ చికిత్సలో సరికొత్త విషయాన్ని కనుగొన్న షికాగో వైద్య నిపుణులు..!

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చి చంపిన భర్త.. స్థానికంగా తీవ్ర కలకలం..!