కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ను అంతమొందించడానికి అనేక మంది ముందడుగు వేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు తమ వ్యాక్సిన్ ముందు రావాలంటే తమ వ్యాక్సిన్ రావాలని హడావిడి పడుతున్నారు. అందులో భాగంగా రష్యా తన దేశం నుంచి మొదటిగా “స్నూత్నిక్ వీ” అందుబాటులోకి తీసుకొని వచ్చింది. కానీ దీనిపై అనేక దేశాలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా కూడా రాబోయే నవంబర్ నాటికి అందరకి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పుకొస్తున్నారు.

కానీ ఇలా వ్యాక్సిన్ హడావిడిగా తీసుకొని వస్తే అసలుకే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నా అమెరికాలో ఎన్నికల నేపధ్యంలోఎట్టిపరిస్థితులలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఇలా ఎవరకి వారు వ్యాక్సిన్ పై తామే పట్టుసాధించామని గొప్పలు చెప్పుకుంటుంటే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో చాలా నాణ్యమైనది రావడానికి 2021 చివరకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అప్పటి వరకు ప్రజలు సామాన్య జీవితం గడపడం కష్టమని, జాగ్రత్తగా మాస్కులను వాడుతూ బయటకు వెళ్ళవలసి ఉంటుందని, ఇక 2021 చివరకు వ్యాక్సిన్ ఒకవేళ అందుబాటులోకి వచ్చినా అది ప్రపంచవ్యాప్తంగా చేరడానికి మరొక రెండేళ్లు పట్టిన ఆచర్యం లేదన్న వ్యాక్యాన్లు చేస్తున్నారు. దీనితో వైరస్ పై వచ్చే నెలలో వ్యాక్సిన్ వచ్చేస్తుందని హడావిడి చేసేవారికి ఇది చెంపపెట్టని చెప్పవచ్చు. ప్రజల ప్రాణాలతో చలగాటమాడకుండా కొంచెం లేట్ అయినా ప్రజలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కూడా కోరుతున్నారు.