చైనాలో వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి 210 దేశాలు కరోనా వైరస్ దెబ్బకు వణికి పోతున్నాయి. అయితే చాలా దేశాల శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. అయితే పలు దేశాలలో ఈ వ్యాక్సిన్ పై ట్రయిల్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని దేశాలలో 100 కు పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నా ఆశాజనక ఫలితాలు కనిపించడం లేదన్నారు డాక్టర్ నాబారో.

అయితే కొన్ని వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్ లేదని.. అయితే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు. ఇక కరోనా కు కూడా వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్ వచినా సెఫ్టీ పరీక్షల్లో నెగ్గుతుందన్న నమ్మకం లేదన్నారు. హెచ్ఐవి, డెంగ్యూ లకు ఇప్పటి దాకా వ్యాక్సిన్ లేదని.. వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అదే విధంగా కరోనాకు కూడా వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం లేదని డాక్టర్ నాబారో అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన రికవరీ రేటు.. గడచిన 24 గంటల్లో 1020 మంది రికవరీ..!

కటింగ్ చేయనన్నందుకు బార్బర్ ను కాల్చి చంపాడు..!

ఏపీలో తొలిరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఆదాయం ఎంతో తెలుసా..!