దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7964 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 173763 కి చేరింది. ఒకే రోజు పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 265 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 4971 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 82369 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 86422 మంది చికిత్స పొందుతున్నారు.

అయితే కరోనా విషయంలో ఓ గుడ్ న్యూస్ వినబడుతుంది. అయితే కరోనా రోజురోజుకు భారీ స్థాయిలో విస్తరిస్తుండగా, రికవరీ కూడా పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11264 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 4.51 శాతానికి చేరింది. ఇక దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో రికవరీ అవుతున్న వారి శాతం 47.40 శాతానికి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా భారత్ కరోనా మహమ్మారిని ఎదుర్కోగలుగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వెనుక భూబాగోత నిజాలున్నాయా?

చిరంజీవి భజన కొట్టుకుంటుంటే, జగపతిబాబు నిశ్శబ్దంగా సామజిక సేవ కార్యక్రమాలు