దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రంగా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3875 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 46711కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 194 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 1583 కి చేరింది. ఇక ఒక్కరోజులోనే 1399 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13161 మందికి చేరింది. ప్రస్తుతం మరో 32138 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ లో ఒకేరోజులో కరోనా భారిన పడిన అత్యధిక కేసులు, మరణాలు ఇదే కావడం గమరణార్ధం.

ఇక గత 24 గంటల్లో మహారాష్ట్రలో 1567, తమిళనాడులో 527, ఢిల్లీలో 349, గుజరాత్ లో 376, పశ్చిమబెంగాల్లో 296 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర, గుజరాత్ లలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. మహారాష్ట్రలో 14541 పాజిటివ్ కేసులు నమోదవగా, గుజరాత్ లో 5804 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఏపీలో ఇప్పటివరకు 1717 మంది కరోనా భారిన పడగా, 34 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. కాగా 589 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 1094 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణాలో నిన్న కొత్తగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1085 కి చేరగా, 29 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. కాగా 585 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 500 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆందోళన..!

కటింగ్ చేయనన్నందుకు బార్బర్ ను కాల్చి చంపాడు..!

ఏపీలో తొలిరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఆదాయం ఎంతో తెలుసా..!