చైనా వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ భారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37 వేల మంది మరణించారు. ఇక 785700 మందికి కరోనా సోకడంతో ఆసుపత్రుల్లో చికిత్య పొందుతున్నారు. ఇక ఇండియాలో కూడా దీని బారిన పడిన వారి సంఖ్య 1281 కి చేరగా, మృతుల సంఖ్య 32 కు చేరింది. దీంతో ప్రభుత్వం కరోనా నివారణ చర్యలని చేపట్టింది. మన దేశంలో మొదట కేరళలో ఈ వైరస్ బయటపడింది. ఇక సోమవారం కొత్తగా 32 మంది ఈ వైరస్ భారిన పడడంతో అక్కడ కరోనా భాదితుల సంఖ్య 222 కు చేరుకుంది. వీరిలో ఒకరు మరణించగా 20 మంది కోలుకున్నారు.

ఇక కరోనా భారీ నుండి కేరళలోని వృద్ధ దంపతులు కోలుకున్నారు. 93 ఏళ్ళ వృద్ధుడు దీని భారీ నుండి కోలుకోగా, అతనితో పాటు 88 ఏళ్ళ అతని భార్య కూడా ఈ వైరస్ నుండి కోలుకుందని కేరళా ఆరోగ్య శాఖ మంత్రి శైలజ వివరించారు. వారిద్దరికీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు ఉన్నపటికీ ఈ వైరస్ నుండి బయటపడ్డారు. కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువుగా ఉన్న పదనంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందినవారు ఈ వృద్ధ దంపతులు. ఇటీవల ఆయన కుమారుడు భార్య పిల్లలు ఇటలీ నుండి తిరిగి వచ్చారు. వారి కారణంగా వారి తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ రావడంతో ఆసుపత్రిలో చికిత్య పొందుతున్నారు. దీంతో వీరందరికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక వృద్ధ దంపతులు కూడా కోలుకోవడంతో కేరళా ఆరోగ్యశాఖ సంతోషం వ్యక్తం చేసింది. ఇక వైరస్ సోకినప్పటికే మానసిక స్థైర్యం కోల్పోకుండా చికిత్యకు సహకరిస్తూ వైద్యుల సలహాలు పాటిస్తే కరోనా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.