ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కూడా కరోనా భారిన పడి అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా పై తెలుగులో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘అ’, ‘కల్కి’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. కరోనా వైరస్ పై సినిమాను తీస్తున్నాడట. కాగా ఈ సినిమా నవంబర్ లోనే స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

ఓ భయంకరమైన వైరస్ ప్రజలను ఇబ్బంది పెడితే ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే పాయింట్ తో సినిమా తీస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగభాగం పూర్తి చేసుకుందని.. దీనిలో అంతా కొత్తవారు నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.