భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దీని భారిన పడి ఇప్పటికే పది మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా 490 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జలుబు, జ్వరం, దగ్గు ఇలా ఏ లక్షణాలు ఉన్న దగ్గరలో ఉన్న ఆసుపత్రులను సంప్రదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియచేశాయి. మరోవైపున ఇలాంటి కరోనా లక్షణాలు కలిగి ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

ఇక కేవలం జలుబు, జ్వరం, దగ్గు మాత్రమే కాకుండా వేరే లక్షణాలతో కూడా కరోనా భారిన పడుతున్నట్లు పరిశోధనలో తేలిందని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తెలియచేసారు. వాసన చూసే స్వభావాన్ని కోల్పోవడం. ఉన్నటుండి వాసన చూసే స్వభావాన్ని కోల్పోయినట్లయితే కొంత అనుమానించవలసి వస్తుందన్నారు. ఇది కరోనా పాజిటివ్ లక్షణం కావచ్చని అక్కడ డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వాసన చూసే స్వభావాన్ని కరోనా పాజిటివ్ లక్షణాలలో చేర్చాలని వారు అంటున్నారు.