చైనా దేశంలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 198 దేశాలను విస్తరించింది. ఇప్పటికే దీని బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 34 వేలకు చేరుకుంది. ఇక ఈ వైరస్ సోకినా వారి సంఖ్య 7 లక్షలు దాటింది. ఇక ఈ వైరస్ ను కట్టడి చేయడానికి భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వైరస్ ఎంత ప్రమాదకరమే, ఏ విధంగా ఇది వ్యాపిస్తుందో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతర ఫ్లూ వైరస్లతో పోలిస్తే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో తెలుస్తుంది. ఇక చైనాలో కాస్త నెమ్మదించిన ఈ మహమ్మారి.. అమెరికా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆ దేశాలలో కరోనా మరణాలు చూస్తుంటే మిగతా దేశాలు వణికిపోతున్నాయి.